Saturday, February 24, 2024

Breaking: ప్రకాశం జిల్లాలో ఘోరం.. లారీని ఢీకొన్న కారు, ముగ్గురు మృతి

ఏపీలోని ప్ర‌కాశం జిల్లాలో ఘోరం జ‌రిగింది. ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఇవ్వాల ఉద‌యం లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఒంగోలుకు చెందిన ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. అయితే.. వారు చెన్నై నుంచి ఒంగోలు వ‌స్తున్నారు. మ‌రికొద్ది సేప‌ట్లో ఇంటికి చేరుకుంటారు అన‌గా ప్ర‌మాదానికి గుర‌య్యి ప్రాణాలు కోల్పోయారు.

ముందు వెళ్తున్న లారీని కారు ఢీ కొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు చనిపోయారు. మృతి చెందిన వారు ఒంగోలుకి చెందిన పవన్, పరమేశ్, శ్రీన గా గుర్తించారు. వీరు చెన్నై నుండి ఒంగోలు వస్తుండగా ఇవ్వాల (శుక్రవారం) ఉదయం ఈ ఘ‌ట‌న జ‌రిగింది. మ‌రికొద్దిసేప‌ట్లో ఇంటికి చేరుకుంటారు అన‌గా యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement