Monday, April 29, 2024

Fire Accident – తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయం సమీపంలో అగ్ని ప్రమాదం

తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయం సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫొటో ఫ్రేమ్ షాపులో చెలరేగిన మంటలు తీవ్రంగా ఎగిసిపడ్డాయి. దీంతో జనాలు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందడంతో అక్కడిచకి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. మంటలు అంటుకున్న చోట గోందరాజు స్వామి రథం ఉంది. ఈ అగ్నిప్రమాదం కారణంగా మాఢవీదిలో రాకపోకలు నిలిపివేశారు. మంట‌లు ఇప్ప‌టి వ‌ర‌కు అదుపులోకి రాక‌పోగా ప‌క్క‌నే ఉన్న మ‌రో బిల్డింగ్ కు వ్యాపించాయి.. దీంతో మ‌రో నాలుగు ఫైరింజ‌న్లు అక్క‌డికి చేరుకున్నాయి.. ఈ అగ్ని ప్ర‌మాదంలో ఫోటో ప్రేమ్ ఉన్న భ‌వ‌నంతో పాటు మాడ‌వీధిలో వేసిన చ‌లువ పందిళ్లు, అక్క‌డ రోడ్డుపై పార్క్ చేసిన కొన్ని బైక్ లు కాలి బూడిద‌య్యాయి..ప్ర‌స్తుతం మంట‌లు ఆర్పే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement