Monday, April 29, 2024

Exclusive – నాణ్య‌త‌, ధ‌ర‌లో బ్రెజిల్ కు ధీటుగా ఎపి పొగాకు…

అమరావతి, ఆంధ్రప్రభ : ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన పొగాకు పండించే దేశాల్లో బ్రెజిల్‌ ఒకటి. అయితే పొగాకు నాణ్యత, ధరలో ఎపీ రైతులు బ్రెజిల్‌తో పోటీ- పడు తున్నారు. కాగా కొవిడ్‌ ప్రభావంతో బ్రెజిల్‌, జింబాబ్వేలో రెండేళ్లుగా పొగాకు నిల్వలు తగ్గిన నేపథ్యంలో ఆయా దేశ వ్యాపారులు మన దేశం నుంచి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపినట్లు- అధికారులు చెబుతున్నారు. అమెజాన్‌ అడవుల పరిధిలో వర్షాధారంతో ఈ పంటను సాగుచేస్తుంటారని, దీన్నే ప్రపంచవ్యాప్తంగా సిగరెట్ల తయారీలో వినియోగిస్తుం టారని వారంటు-న్నారు.

బ్రెజిల్‌లో నాణ్యమైన పొగాకు కిలో ధర మన నగదులో సుమారు రూ.240. ఇప్పుడు దేశంలోని మేలిమి రకం సరాసరి ధర రూ.210, గరిష్ఠ ధర కిలో రూ.275 పలికింది. ఈ ఏడాది ఆయా దేశాల్లో సాగు విస్తీర్ణం పెరిగినందున వచ్చే ఏడాది ఇవే ధరలు ఉంటాయని గ్యారంటీ- లేదని వారంటు-న్నారు. దీంతో రైతులు ఆచితూచి సాగు చేసుకోవాలని బోర్డు అధికారులు సూచిస్తున్నారు. బ్యారన్‌కు 37 క్వింటాళ్లకు పండేలా పంట వేసుకోవాలని వారంటు-న్నారు. బ్యారెన్లను, పొలాలను అధిక ధరలు పెట్టి కౌలుకు తీసుకోవద్దని సూచిస్తున్నారు. పొగాకుతో పాటు- ప్రత్యామ్నాయాలైన ఇతర ఆహార పంటలను కూడా వేసుకోవాలనివారు కోరుతున్నారు.ఇదిలా వుండగా, ఈ వారంలో అన్ని వేలం కేంద్రాల్లో అమ్మకాలు పూర్తిచేసే ఆలోచన లో అధికారులున్నారు. ఈసారి ధర కొంత ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో వచ్చే సీజన్‌లో ఎక్కువ కౌలుకు బ్యారెన్లు తీసుకుంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని వారంటు-న్నారు. ఏపీలో ప్రధానంగా పొగాకు పండిస్తున్న ప్రకాశం జిల్లాలో ఎస్‌ఎల్‌ఎస్‌, ఎస్‌బీఎస్‌ పరిధిలో 11 వేలం కేంద్రాలున్నాయి. వీటిలో ఈ ఏడాది 87.27 మిలియన్‌ కిలోల పొగాకు ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 24న తొలిదశ, మార్చి 10న రెండో దశ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో కిలో గరిష్ఠ ధర రూ.200 కొనసాగింది. సుమా రు రెండు నెలలు వ్యాపారులు ఇదే సీలింగ్‌ పాటించారు. ఆ తరువాత క్రమంగా ధరలు పెరుగుతూ వచ్చాయి. గరిష్ఠంగా కిలో రూ.275కు చేరింది. ప్రస్తుతం తుది దిశలోను మేలిమి రకం పొగాకు కిలో రూ.270కు పైగా నమోదు కావడం గమనార్హం.

విదేశీ ఆర్డర్లు రావడంతో వ్యాపారుల మధ్య పోటీ- పెరిగి ఎవరికి వారే ధరలు పెంచారు. దీంతో మీడియం, లోగ్రేడ్‌లకు సైతం ఈ ఏడాది మంచి ధర లభించింది. మీడియం గ్రేడ్‌కు సరాసరి ధర రూ.150 కు పైగా నమోదైంది. పొగాకు అమ్మకాలు సరాసరి ధర రూ.210కి పైగానే కొనసాగుతోంది. ఇప్పటికే జిల్లాలో అధికారిక, అనధికారిక పొగాకు కలిపి 110 మిలియన్‌ కిలోలకు పైగానే అమ్మకాలు జరిగాయి. ఈ నేపథ్యంలో రోజుకు 700లకు పైగా బేళ్లు వేలానికి వస్తున్నాయి. ధరలు ఆశాజనకంగా ఉండటంతో 2023 సీజన్‌కు విస్తీర్ణం పెంచుకునే ఆలోచనలో పొగాకు రైతులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement