Thursday, September 21, 2023

AP: పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి వెల్లంపల్లి ఘాటు వ్యాఖ్యలు

ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ అని వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. తన అన్నకి సపోర్ట్ గా నిలవలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇలా చేయడం ఏంటన్నారు. జైలు బయట పవన్ కళ్యాణ్ ముసుగు తీశారన్నారు. టీడీపీ పవన్ వేరు వేరు కాదు, ఇద్దరు ఒకటే అని ఎప్పటినుంచో చెప్తున్నామన్నారు. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడన్నారు. పవన్ కళ్యాణ్ కి సిగ్గు ఉందా అని ప్రశ్నించారు.
క్రిమినల్ అని రిమాండ్ వేస్తే పవన్ వెనకేసుకురావటం దిక్కుమాలిన చర్య అన్నారు. నువ్వు నాశనం ఐపోతవన్నారు. యుద్ధం చేస్తావు ఎవరితో… రా మేము సిద్దమన్నారు.

- Advertisement -
   


పవన్ కళ్యాణ్ కి సరైన దిశ దశ లేదన్నారు. ఒకరితో పెళ్లి మరొకరితో సహజీవనం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ చంద్రబాబును నమ్ముకున్నాడు.. తాము ప్రజలను నమ్ముకున్నామన్నారు. తాము సింగల్ గా పోటీ చేస్తాం అని ప్రకటించారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా తాము సిద్దంగా ఉన్నామన్నారు. అందరు కలిసి రండి.. మేము సిద్దం అని ప్రకటించారు. తాము సింగల్ గా వస్తున్నామన్నారు. తమతో ప్రజలు ఉన్నారు.. తాము సిద్దం అని తెలిపారు. జనసైనికులకు తన విజ్ఞప్తి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసం పని చేస్తున్నాడు.. ఒకసారి ఆలోచన చెయ్యండన్నారు. జనసైనికులు కూడా పవన్ ను తిరస్కరిస్తారన్నారు. రానున్న అరు ఎన్నికల్లో కూడా జగన్ సీఎంగా ఉంటారన్నారు. పవన్ నీకు దమ్ము, సత్తా ఉంటే నా పై పోటీ చేయి అని సవాల్ విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement