Thursday, April 25, 2024

చట్టాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి : శ్రీనివాస్ నాయక్

ఇందుకూరుపేట, (ప్రభన్యూస్‌ ) : చట్టం అందరికీ చుట్టమేనని , చట్టం ముందు అందరూ సమానమేనని ప్రతి ఒక్కరూ చట్టాల పట్ల అవగాహన కలిగిఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ,సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం. శ్రీనివాసులు నాయక్‌ అన్నారు. జిల్లా న్యాయసేవాధికార చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీ. యామిని ఆదేశాల మేరకు శనివారం ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నం ఎస్టీ కాలనీలో సీనియర్‌ సివిల్‌ జడ్జి ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కక్షిదారులు లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేదలు తమకు న్యాయస్థానాలు దూరమన్న అభిప్రాయంతో ఉండరాదని , జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వారికి ఉచిత న్యాయ సహాయం అందజేస్తామన్నారు. వివిధ చట్టాల గురించి వారికి అవగాహన కల్పించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పిల్లలను బాగా చదివించాలని వారికి సూచించారు.

ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ వసుంధర, గ్రామ కార్యదర్శు లు వీరయ్య ,వాణి వీఆర్వోలు టి. మురళి, బి. వెంకటలక్ష్మీ, కార్మిక శాఖ అధికారి కే. రామారావు, ఉపసర్పంచ్‌ కే. వెంకటరమణారెడ్డి, నాయకులు పి, జనార్ధన్‌రెడ్డి, వి. మహిధర్‌రెడ్డి, డి.ఫణీంద్రనాయుడు, పీఎల్‌వీ ప్రశాంతి, లక్ష్మీ, వేణుగోపాల్‌, రాజేశ్వరీ, పెంచల నరసయ్య, అంగన్‌వాడీలు ,తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement