Monday, March 25, 2024

శ్రీరామ చంద్ర‌కి పెరుగుతోన్న మ‌ద్ద‌తు..స‌జ్జ‌నార్ ఏమ‌న్నారో తెలుసా..

తెలుగు బిగ్ రియాల్టీ షో బిగ్ బాస్5 సీజ‌న్ న‌డుస్తోంది. ఈ షోలో 19మంది కంటెస్టెంట్స్ లోప‌లికి వెళ్ల‌గా..తొమ్మిది మంది మిగిలారు. జ‌శ్వంత్ ఆరోగ్యం బాగోలేని కార‌ణంగా బ‌య‌టికి వ‌చ్చేశాడు. కాగా హౌస్ లో వున్న సింగర్ శ్రీరామచంద్రకు సెలబ్రిటీల సపోర్ట్ గట్టిగా వ‌స్తోంది.హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ శ్రీరామ చంద్రకు తన సపోర్ట్ ఉంద‌ని తెలిపింది. గ్రాండ్ ఫినాలేలో శ్రీరామ్ టైటిల్‌ను కైవసం చేసుకోవడానికి తన అభిమానులు ఆయనకు ఓటు వేయాలని కోరింది. ఇప్పుడు ప్రముఖ హిందీ కమెడియన్ భారతీ సింగ్ తన స్నేహితుడైన శ్రీరామ చంద్రకు ఓటు వేయమని తన అభిమానులను అడుగుతూ సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.ఎంతో పాపులారిటీ ఉన్న సోనూసూద్ కూడా తెలుగు బిగ్‏బాస్‏ షో గురించి స్పందించాడు.. ప్రస్తుత సీజన్‏లో పాల్గొన్న సింగర్ శ్రీరామ్ చంద్రకు తన మద్దతు ఉంటుందని ప్రకటించాడు. ఇక తాజాగా ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ప్ర‌త్యేక వీడియో ద్వారా శ్రీరామ్ చంద్ర అద్భుతంగా గేమ్ ఆడుతున్న‌ట్టు తెలియ‌జేశాడు. పాట‌లు కూడా బాగా పాడుతున్నాడ‌ని, ఆయ‌న క‌ప్ గెలుస్తాడ‌నే న‌మ్మకం ఉంద‌ని తెలియ‌జేశారు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement