రాజమండ్రిలో శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయని,నగరవాసులు రాత్రి వేళ రోడ్లపై తిరగడానికి భయపడుతున్నారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన గోరంట్ల ఇటీవల ధవళేశ్వరం గ్రామంలో బ్లేడ్ బ్యాచ్ వల్ల మృతి చెందిన కేసును త్వరితగతిన విచారణ వేగవంతం చేసి దోషులను న్యాయస్థానం వద్ద హాజరు పరిచి వారికి శిక్ష పడేలా చేయాలని సూచించారు. అలాగే నగరంలో రాత్రిపూట గస్తీ పెంచాలని, ప్రతి పౌరుడికి రక్షణ కల్పించవలసిన బాధ్యత పోలీసు వ్యవస్థ పై ఉందని తెలిపారు.. ప్రజలకు భద్రత కలిగించేలా పోలీస్ వ్యవస్థ పని చేయాలని గోరంట్ల కోరారు .
శాంతి భద్రతలపై పోలీసులతో గోరంట్ల సమీక్ష…

Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement