Sunday, April 28, 2024

Assets – ప‌వ‌న్ క‌ల్యాణ్ నంపాద‌న 114 కోట్లు… అప్పులు 64 కోట్లు..

పిఠాపురం: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో తన ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు వెల్లడించారు. ఐదేళ్లలో ఆయన సంపాదన రూ.114,76,78,300. ఇందుకు ఆదాయపన్ను రూపంలో రూ.47,07,32,875, జీఎస్టీ కింద రూ.26,84,70,000 చెల్లించినట్టు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

పవన్‌ అప్పులు రూ.64,26,84,453గా ప్రకటించారు. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు రూ.17,56,84,453, వ్యక్తుల నుంచి తీసుకున్నవి రూ.46.70 కోట్లు అని వివరించారు.

విరాళాలు రూ.20కోట్లు పైనే..

వివిధ సంస్థలు, జనసేన పార్టీ నిర్వహించిన సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల కోసం రూ.17,15,00,000 విరాళం అందించినట్టు తెలిపారు. పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా, జనసేన క్రియాశీలక కార్యకర్తల ప్రమాద బీమా లాంటి కార్యక్రమాల కోసం వేర్వేరు సందర్భాల్లో విరాళాలు అందజేసినట్టు వివరించారు. వివిధ సంస్థలకు రూ.3,32,11,717ల విరాళాలు అందచేశారు. కేంద్రీయ సైనిక్ బోర్డుకు రూ.కోటి, ఏపీ సీఎం సహాయ నిధికి రూ.50లక్షలు, తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.50లక్షలు, శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌కు రూ.రూ.30,11,717, పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్ లెన్స్‌కు రూ.2 లక్షలు విరాళం ఇచ్చినట్టు పేర్కొన్నారు.

వదిన నుంచి రెండు కోట్ల అప్పు

- Advertisement -

వ్యక్తి గత రుణాల కింద మొత్తం 15 మందితో నగదు తీసుకున్నారు. వారిలో పవన్ వదిన, చిరంజీవి భార్య కొణిదెల సురేఖ సైతం ఉండటం విశేషం. ఆమె దగ్గర రూ. 2 కోట్లు వ్యక్తి గత రుణం కింద పుచ్చుకున్నట్లు ఆఫిడవిట్లో పొందు పర్చారు. అంతే కాకుండా విజయలక్ష్మి వీఆర్- రూ.8,00,00,000, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ -రూ.6,35,00,000, లీడ్ ఐటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్- రూ. 6,00,00,000, ఎంవీఆర్ఎస్ ప్రసాద్- రూ. 3,50,00,000, యుర్నేని నవీన్- రూ. 5,50,00,000, ప్రవీణ్ కుమార్- రూ.3,00,00,000, మైత్రీ మూవీ మేకర్స్- రూ.3,00,00,000, శ్రీ యశ్వంత్ ఫైనాన్షియర్స్- రూ.3,00,00,000, రాహుల్ కుందవరం- రూ.2,80,00,000, ఎంవీఆర్ఎస్ ప్రసాద్ హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ- రూ.2,00,00,000, కొణిదెల సురేఖ- రూ.2,00,00,000, కోటింరెడ్డి సాహిత్యరెడ్డి- రూ. 50,00,000, లింగారెడ్డి లలిత- రూ. 50,00,000, దయాకర్- రూ.45,00,000, డీవీవీ ఎంటర్‌ప్రైజెస్- రూ.10,00,000ల ద్వారా వ్యక్తిగత రుణాలు పొందినట్లు జాబితాలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement