Sunday, February 5, 2023

జిమ్ చేస్తూ గుండెపోటుతో వ్య‌క్తి మృతి

వ్యాయామం చేస్తూ పలువురు గుండెపోటుతో మరణిస్తున్నారు. అలాంటి ఘటనే తాజాగా మహారాష్ట్రలో జరిగింది. వ్యాయామం చేస్తూ ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందాడు. ఈ ఘటన పల్గర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రహ్లాద్ నికమ్ (67) అనే వ్యక్తి రోజూ సాయంత్రం తన ఇంటికి సమీపంలోని జిమ్ లో వర్కవుట్స్ చేస్తుంటారు. రోజూ లాగే జిమ్ కు వెళ్లి వ్యాయామం చేస్తుండగా ప్రహ్లాద్ ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయారు. జిమ్ నిర్వహకులు ప్రహ్లాద్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రహ్లాద్ మృతికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement