Monday, May 6, 2024

జూలై 4 నుంచి ఎప్‌ సెట్‌..

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపీ సెట్‌(ఎప్‌ సెట్‌) జూలై నాలుగో తేదీ నుంచి 12వ తేదీ వరకు జరుగుతుందని ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొ. బి. సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం అభ్యర్థులకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల పదో తేదీ వరకు గడువు ఉందన్నారు. ఇప్పటి వరకు లక్షా 86 వేల 562 మంది అభ్యర్థులు ఎప్‌ సెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. దీనిలో ఇంజనీరింగ్‌ అండ్‌ ఫార్మసీ కోసం(ఎంపీసీ స్ట్రీమ్‌) లక్షా 28 వేల 507 మంది, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కోసం(బైపీసీ స్ట్రీమ్‌) 57 వేల 419 మంది, రెండింటికీ హాజరయ్యేందుకు 636 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.

ఎప్‌ సెట్‌ రాసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో సెట్స్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే గతేడాది ఎప్‌ సెట్‌ రాసిన మొత్తం అభ్యర్థులు లక్షా 66 వేల 460 మంది ఉండగా.. ఈ ఏడాది ఇంకా గడువు ఉండగానే దాదాపు 20 వేలకుపైగా అదనంగా దరఖాస్తులు నమోదయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement