Tuesday, May 7, 2024

ప్యాక్షన్ రిపీట్ కావొద్దు.. ఎమ్మెల్యే పెద్దారెడ్డి

యల్లనూరు, ఏప్రిల్ 28 (ప్రభ న్యూస్) : ఫ్యాక్షన్ రిపీట్ కావొద్దని, యల్లనూరు మండలంలోని అధికారులు ఏకపక్షంగా వ్యవహ‌రిస్తున్నారంటూ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి యల్లనూరు పోలీస్ స్టేషన్ లో ధర్నా చేపట్టారు. గత రెండు రోజుల క్రితం మండలంలోని దంతాలపల్లి గ్రామంలో వైసీపీ పార్టీకి చెందిన భోగతి నారాయణ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇనుప రాడ్లతో దాడికి ప్రతిదాడులు చేసుకోవడం జరిగింది. చట్టానికి అందరూ సమానమే అని చెప్పుకొచ్చే పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గానికి చెందిన వ్యక్తులపై 307సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో మరోవర్గం అయిన భోగతి నారాయణ రెడ్డి వర్గం వ్యక్తులపై 324సెక్షన్ కింద కేసు నమోదు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శుక్రవారం యల్లనూరు పోలీస్ స్టేషన్ లో ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా తాడిపత్రి ఎమ్మెల్యే విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ… యల్లనూరు మండలంలో అనుబంధ గ్రామాలు కలుపుకొని సుమారు 38గ్రామాలు వున్నాయన్నారు. ఇందులో ప్యాక్షన్ గ్రామాలు 18దాకా ఉన్నాయన్నారు. అందులో దంతాలపల్లి గ్రామం ప్రత్యేకం అన్నారు. ఆ గ్రామానికి ఇటు అనంతపురం జిల్లా అటు కడప జిల్లాకు సంబంధాలు ఎక్కువ. మండలంలో ఆ గ్రామం నుండే ప్యాక్షన్ ప్రారంభమైంద‌ని, అందుకే మండలంలో ఫ్యాక్షన్ పునరావృతం కాకూడదన్నదే అభిప్రాయమ‌న్నారు.

అందుకే తాను ఈ రోజు పోలీస్ స్టేషన్ కు రావాల్సి వచ్చిందన్నారు. తాను తాడిపత్రి-నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాక మునుపు నా గ్రామం యల్లనూరు మండలంలోని తిమ్మాంపల్లి గ్రామం అని, అన్ని శాఖల అధికారులు గమనించాలన్నారు. వైసీపీ పార్టీ ప్రజల పార్టీ, ప్యాక్షన్ వద్దు, విద్యనే ముద్దు అన్న పార్టీ వైసీపీ పార్టీ అన్నారు. పార్టీలోని కొందరు నియంత పోకడలు కొనసాగిస్తూ ప్రశాంతంగా వున్న గ్రామాల్లో చిచ్చులు పెట్టడం సరికాదన్నారు. మండలంలో దళిత మహిళ ఎంపీపీగా కొనసాగుతుంటే ఆమెకు మండల గ్రాంట్ కు సంబంధించిన‌ వివరాలతో పాటు మండల అభివృద్ధి పై అధికారులు చర్చించాలి. కానీ అధికారులు అందుకు భిన్నంగా వ్యవహారిస్తున్నారని దుయ్యబట్టారు. నియంత ధోరణి మాని ప్రజల మన్ననలు పొందాలని హితావు పలికారు. ఇప్పటికైనా అధికారుల తీరు మార్చుకోవాలని గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. అలాగే వర్గాలను ప్రేరేపించే వారిపై పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళతామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement