Thursday, April 25, 2024

AP: రచ్చకెక్కిన టీడీపీ విభేదాలు.. అబ్జ‌ర్వ‌ర్ల ముందే కళ్యాణ‌దుర్గం నేతల కుమ్ములాట‌!

అనంతపురం ప్రభ న్యూస్‌ బ్యూరో: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరోసారి రచ్చకు ఎక్కాయి. బుధవారం స్థానిక ఎం వై ఆర్‌ కళ్యాణమండపంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఒకరికొకరు బాహాబాయికి దిగారు. రాయలసీమ ఇంచార్జ్‌ మాజీ మంత్రి అమర్నాథ్‌ రెడ్డి, అనంతపురం ఇన్చార్జి బీటీ- నాయుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తదితరులు కళ్యాణ్‌ దుర్గం నియోజకవర్గ టిడిపి నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశం కొనసాగుతున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే హనుమంతయ్య చౌదరి, నియోజకవర్గ ఇన్చార్జ్‌ ఉమామహేశ్వర నాయుడు వర్గాల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఒకరిపై ఒకరు దాడులకు పూనుకున్నారు.

కుర్చీలను గాలిలోకి లేపి కొట్టు-కునే ప్రయత్నం చేశారు. రాష్ట్ర నాయకులు జోక్యం చేసుకొని సర్దుబాటు- చేసే ప్రయత్నం చేసినప్పటికీ, కార్యకర్తలను అదుపు చేయలేకపోయారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గడచిన కొన్ని రోజులుగా గ్రూపు విభేదాలు తారాస్థాయిలో కొనసాగుతున్నాయి. స్థానిక, స్థానికేతర అంశాన్ని ముందుకు తీసుకొచ్చి నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఉమామహేశ్వర నాయుడు ఉరవకొండ నియోజకవర్గం లోని బెలుగుప్ప మండలానికి చెందినవారు. గడిచిన ఎన్నికల్లో ఉమామహేశ్వర్‌ నాయుడుకు టిడిపి టికెట్‌ లభించింది. ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. మాజీ ఎమ్మెల్యే ఉన్న హనుమంతరావు చౌదరి తో పాటు- స్థానిక నేతలు ఉమామహేశ్వర నాయుడు నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు.

- Advertisement -

ఆయన ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటు-న్నారని వచ్చే ఎన్నికల్లో స్థానికులకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా కంబదూరు జడ్పిటిసి రామ్మోహన్‌ చౌదరి, సీనియర్‌ నాయకులు ఒక వర్గంగా ఏర్పడి స్థానికులకు అవకాశం కల్పించాలని సమావేశంలో ప్రస్తావించారు. దీంతోపాటు- నియోజకవర్గ కమిటీ-లో స్థానికులకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. గొడవ నేపథ్యంలో ఉమామహేశ్వర్‌ నాయుడు వర్గానికి చెందినవారు ఫంక్షన్‌ హాల్‌ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కంబదూరు చెందిన నరేంద్ర అనే సీనియర్‌ నాయకుడి చొక్కా చింపివేయడంతో ఆయన పార్టీ పెద్దల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు. ఇలా ఉండగా ఇవన్నీ తమ కుటు-ంబంలో జరిగే అంతర్గత విషయాలని, అన్ని రాజకీయ పార్టీల్లో ఇటు-వంటి గొడవలు ఉంటాయని, వాటిని సర్దుబాటు- చేసుకుంటామని ఇన్చార్జ్‌ అమర్నాథ్‌ రెడ్డి స్పష్టం చేశారు.

కళ్యాణ్‌ దుర్గం, మడకశిర నియోజకవర్గం త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలరాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి దుర్మార్గపు పాలన కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి అమర్నాథ్‌ రెడ్డి స్పష్టం చేశారు. మూడు సంవత్సరాల్లో ఎటు-వంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కొత్తగా ఒక పరిశ్రమ ఏర్పాటు- చేయకపోగా వచ్చిన పరిశ్రమలు వెనక్కి పోయాయన్నారు. గడచిన మూడు సంవత్సరాలలో భారీ వర్షాలు కురవడంతో చెరువులు ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయని అయితే ఒక ఎకరా పంట సాగు కాలేదు అన్నారు. చెరువుల కింద ఆయకట్టు-ను అభివృద్ధి చేయలేదని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పులివెందులకు చెప్పిన సమయానికి నీటిని ఇచ్చిన ఘనత దక్కిందని తెలిపారు. కుప్పంకు ఇప్పటివరకు నీటిని ఇవ్వలేకపోయారని అన్నారు. మూడు సంవత్సరాల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఏదైనా సమస్యలపై ప్రతిపక్షాలు పోరాటం చేస్తే వారిపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement