Monday, April 29, 2024

తమ్ముడు మంత్రి కాబోతున్నాడు: డిప్యూటీ సీఎం ధర్మాన సంచలన ప్రటకన

ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రిగా దిగిపోతున్నానని, తన సోదరుడు ధర్మాన ప్రసాదరావు మంత్రి కాబోతున్నారని తెలిపారు. వైయస్ మరణం తర్వాత తాను జగన్ వెంట నడిచానని… ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశానని గుర్తు చేశారు. గతంలో తమ్ముడు ప్రసాదరావు మంత్రిగా ఉన్నప్పుడు… నరసన్నపేట ఉపఎన్నికలో తనపై మరో సోదరుడు రామదాసును బరిలోకి దించాడని.. ఆ ధర్మ యుద్ధంలో తానే గెలిచానని కృష్ణదాస్ చెప్పారు.  2019 ఎన్నికల్లో తమ్ముడు ప్రసాదరావు కూడా వైసీపీ నుంచి పోటీ చేశాడన్నారు. ఎన్నికల్లో ఇద్దరం గెలిచామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ తనను గుర్తించి డిప్యూటీ సీఎం చేశారని, మూడేళ్లు ఖాళీగా ఉన్న తమ్ముడు రేపో, మాపో మంత్రి అవుతాడని వ్యాఖ్యానించారు. ఎవరు మంత్రిగా ఉన్నా తమ కుటుంబమంతా ఒక్కటేనని ధర్మాన స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement