Thursday, January 16, 2025

Devineni Uma: జగన్ తన చెల్లెళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పాలి…

సీఎం జగన్ తన చెల్లెళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ అన్నారు. బాబాయి హత్యను గుండెపోటుగా మార్చాలనుకుంటే అది కాస్తా గొడ్డలిపోటుగా బయటపడిందని ఆయన ఆరోపించారు. తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఐదేళ్లుగా కేసును నీరుగార్చారని, నిందితుల అరెస్టును సైతం వ్యవస్థలను ఉపయోగించి అడ్డుకున్నారని ఆరోపించారు.

బాబాయిని చంపిందెవరో దేవుడికే కాకుండా ప్రజలకు కూడా తెలుసని, జగన్ పాలనలో న్యాయం జరగదని స్పష్టం చేశారు. నిందితులను పక్కనపెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని, హంతకులకు, జగన్‌కు ఓట్లు వేయవద్దంటున్న చెల్లెళ్లకు జగన్ సమాధానం చెప్పాలని ఉమ నిలదీస్తూ.. వైఎస్ జగన్‌కు వివేకా కుమార్తె డాక్టర్ సునీత సంధించిన ప్రశ్నల వీడియోను ఎక్స్‌లో పంచుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement