Sunday, April 28, 2024

నందిగామ ఏసీపీ ఆఫీస్‌, పోలీస్ స్టేషన్ త‌నిఖీ చేసిన డీసీపీ..

ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఏసీపీ కార్యాలయం, పోలీస్ స్టేషన్ ను విజయవాడ రూరల్ డీసీపీ అజిత వెనిగండ్ల సంద‌ర్శించి తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీబీ నాగేశ్వర రెడ్డికి సీఐ సతీష్ కు డీసీపీ అజిత పలు సూచనలు చేశారు. అనంత‌రం నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణ పరిధిలో క్రైమ్ రేట్ తగ్గేలా చర్యలు తీసుకోవాలని, జాతీయ రహదారిపై యాక్సిడెంట్లు జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించేల చర్యలు తీసుకోవాలని డీసీపీ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement