Wednesday, May 1, 2024

ఠారెత్తిస్తున్న ఎండ‌లు – మ‌ల‌మ‌ల మాడుతున్న కూలీలు..

అమరావతి, ఆంధ్రప్రభ : భానుడి ప్రచండ వీక్షణతో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. బయట తిరగొద్దని విపత్తుల నిర్వహణ విభాగం హెచ్చరిస్తున్నా పొట్టకూటి కోసం కూలీలు పనులకు వెళ్లక తప్పదు ఎండ తీవ్రత అధికంగా వున్నా కనీస వసతులు లేక కూలీలు ఇక్కట్లకు గురవు తున్నారు.దీంతో తీవ్ర ఎండల్లో సైతం ఉపాధి హామీ పనులకు కూలీలు వెళ్తున్నారు. ఉదయం 7 నుంచి 11గంటల వరకు కూలి పనులు చేస్తున్నా రు. రాష్ట్రంలోని దాదాపు 600 మండలాల్లో నిత్యం ఒక్కో మండలంలో 1000 నుంచి 2వేల మంది కూలీలు పనులు నిర్వహిస్తున్నారు.
గతంలో ఉపాధి కూలీకి రోజుకు రూ.257 చెల్లించగా, ప్రస్తుతం రూ.272కు పెంచారు. కొలతలు కూడా తగ్గించారు. అయి తే ఉపాధి కూలీలకు సరైన వసతుల కల్పించకపోవడంతో ఎండలోనే పనులు చేస్తున్నారు. పని ప్రదేశంలో నీడ, తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు- ఉంచాలనే నిబంధన అమలు కావడం లేదు. ఎండ తీవ్రత అధికంగా ఉన్న చోట అధికారులు కూలీలకు వసతులు కల్పించాలి. ప్రతీ గ్రామంలో కనీసంగా 300 మందికిపైగా కూలీలు ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో కూలీలకు అనుగుణం గా తాగునీటి సౌకర్యం కల్పించాలి. అయితే ఫీల్డ్‌ అసిస్టెంట్లు- ఒకటి, రెండు కవర్లతో నీడ కల్పిస్తున్నా రు.

అవి సరిపోకపోవడంతో కూలీలు చెట్ల నీడలో సేద తీరుతున్నారు. పనికి వెళ్లే సమయంలో కూలీలే నీటి బాటిల్‌ తీసుకెళ్తున్నారు. పని ప్రాంతాల్లో తాగునీరు అందుబాటు-లో లేకపోవడంతో దాహంతో ఇబ్బంది పడుతున్నారు. కూలీలు డీహైడ్రేషన్‌కు గురవ్వకుండా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు- అందజేయాల్సి ఉన్నా ఎక్కడా అమలు కావడంలేదు. కూలీలు ఎక్కువగా పని చేస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు- చేయాలి. ఇది కూడా అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికే ఎండ తీవ్రత పెరగ్గా, అప్రమత్తంగా లేకపోతే కూలీలకు ఆరోగ్య సమస్య లు తప్పవు. ప్రతీరోజు ఉదయం 8గంటలకు కూలీ లు పనులకు వస్తుండగా, 11గంటలకు హాజరు వేస్తున్నారు. తిరిగి మధ్యాహ్నం 3గంటలకు హాజరు తీసుకోవాల్సి ఉంటు-ంది.

అప్పటి వరకు సేద తీరడానికి వారికి సరైనా నీడ, తాగునీటు- అందుబాటు-లో ఉండడంలేదు. ఇటీ-వల ప్రభుత్వం నూతన సాప్ట్‌nవేర్‌ను రూపొందించింది. సాంకేతిక ఇబ్బందులు వస్తుండటంతో కూలీలు చాలా సేపు పనిచేసే ప్రదేశాల్లోనే వేచి ఉంటు-న్నారు. వేసవిలో వ్యవసాయ పనులు లేకపోవడంతో ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలు జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయ సీజన్ల సమయంలోనూ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించేందుకు వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ ఉండగా, అది నెరవేరడం లేదు. వ్యవసాయానికి అనుసంధానం చేస్తే అటు- కూలీలతోపాటు-, రైతులకు కూడా మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

క్షేత్ర సహాయకుల మెడపై కత్తి
నిర్దేశించిన లక్ష్యాల మేరకు గడువులోగా పని దినాలు ఉపయోగించన-్లటెతే అలాంటి వారందరికీ ఉద్వాసన తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. అనేక ఏళ్లుగా పని చేస్తున్న క్షేత్ర సహాయకులు తమ ఉద్యోగాలను కాపాడుకునేందుకు మండు-టె-ండలో ఎలాంటి ఉపశమన సదుపాయాలూ కల్పించకుండా కూలీలతో పనులు చేయిస్తున్నారు. మంచినీళ్లు, మజ్జిగ ఎలాగూ సరఫరా చేయడం లేదు. తీవ్రమైన ఎండలో అస్వస్థతకు గురయ్యే కూలీలకు పని ప్రదేశాల్లో ప్రాథమిక వైద్యం అందించే ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు- కూడా లేవు. నరేగా అమలులో క్షేత్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న దాదాపు 13 వేల మంది క్షేత్ర సహాయకులు ఎంతో కీలకం. కూలీలను పని ప్రదేశాలకు రప్పించి వారితో పని చేయించడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరిలో ఒక్కొక్కరు ఏడాదిలో తమ పరిధిలో 7,500 పని దినాలు ఉపయోగించుకునేలా కూలీలకు పని కల్పించాలి. ఈ నిబంధన చాలాకాలంగా ఉన్నా లక్ష్యాన్ని చేరుకోని క్షేత్రస్థాయి సహాయకులను కొద్దికాలంగా తొలగిస్తున్నారు.

గత ఏడాది నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేదన్న కారణంగా దాదాపు 600 మందిని అధికారులు పక్కన పెట్టారు. ఈ ఏడాది కూడా ఇప్పటి నుంచే అధికారులు క్షేత్ర సహాయకులపై ఒత్తిడి పెంచడంతో వారంతా కూలీలతో మాడు పగిలే ఎండల్లో పనులు చేయిస్తున్నారు. రాయలసీమ, కోస్తాలోని పలు జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు హడలిపోతున్నారు. అయితే తమ ఉద్యోగాలను కాపాడుకునేందుకు కూలీలను కొన్ని చోట్ల బలవంతంగా క్షేత్రసహాయకులు పనుల్లోకి తీసుకొస్తున్నారు. పని ప్రదేశాల్లో నీడ కల్పించకపోగా.. దాహార్తి తీర్చుకోడానికి మజ్జిగ, మంచినీళ్లు కూడా సరఫరా చేయడం లేదని చెబుతున్నారు. ఇప్పటికయినా ప్రభుత్వం స్పందించి ఉపాధి హామీ కూలీలకు వేసవి కాలంలో కనీస వసతులు కల్పించాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement