Sunday, April 28, 2024

AP: కఠిన చర్యలతో నేరాల నియంత్రణ… పోలీస్ కమీషనర్ క్రాంతి రానా టాటా

(విజయవాడ ప్రభ న్యూస్)
ఎన్టీఆర్ జిల్లా పరిధిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కఠిన చర్యలు తీసుకోవడంతోనే 2023 లో నేరాల నియంత్రణ జరిగిందని పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా తెలిపారు. విజయవాడలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శనివారం 2023 వార్షిక క్రైమ్ నివేదికను విలేకరులకు వివరించారు.

ఈ సందర్భంగా క్రాంతి రానా టాటా మాట్లాడుతూ గత ఏడాదితో పోల్చుతే నేరాల శాతం తగ్గిందన్నారు. హత్యలు కూడా 29 శాతం తగ్గాయన్నారు. అటెంప్ట్ మర్డర్ లు కూడా తగ్గాయన్నారు.కిడ్నాప్ లు కూడా తగ్గాయని చెప్పారు. నగరంలో ప్రెండ్లి పోలిసింగ్ నిర్వహించడం వలన కూడా నేరాల తగ్గుదల పట్టాయన్నారు. రౌడీ షీటర్ మర్డర్ కావడం కాని, రౌడీ షీటర్లు మర్డర్ లు చేయలేదన్నారు. అ సాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపడంతో పాటు నగర బహిష్కరణ చేసాం అని చెప్పారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచడం వలన నేరాలు ముఖం పట్టాయి అన్నారు. రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుదల పట్టాయన్నారు. మహిళలపై నేరాలు కూడా తగ్గాయన్నారు. ఫోక్సో కేసులు 3శాతం తగ్గాయన్నారు.
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నగరంలో ఆంక్షలు…
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా విజయవాడ నగరంలో ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా ప్రకటించారు. సెక్షన్ 30, 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు జాగరత్తగా ఉండాలనీ సూచించారు. బందరు రోడ్డు, బి ఆర్ టి ఎస్ రోడ్డు, ఫ్లై ఓవర్ లు మూసివేస్తాం అన్నారు. 31ఫస్ట్ వేడుకలు నిర్వహించే వారు పోలీస్ అనుమతి తీసుకోవాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి కేసులో నమోదు చేస్తామన్నారు. 4 వేల సీసీ కెమెరాల ద్వారా అనుక్షణం పరిశీలన జరుపుతామన్నారు. రోడ్లపై కేక్ లు కట్ చేయడం, తాగి రోడ్లపై తిరగడం చేయొద్దన్నారు. ప్రజలందరు ఇంటిలోనే వేడుకలు జరుపుకోవాలన్నారు. సైలెన్సర్ లు తీసి బైక్ లు నడిపితే చర్యలు తప్పవనీ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement