Thursday, May 2, 2024

AP: ఇవాళ సీపీఎస్ ఉద్యోగుల ఛ‌లో విజ‌య‌వాడ‌… అమ‌ల్లో 144సెక్ష‌న్‌…

సీపీఎస్ ఉద్యోగులు ఇవాళ ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. సీపీఎస్ వల్ల తమకు అన్యాయం జరిగిందని సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి మొరపెట్టుకున్నని అంటున్నారు సీపీఎస్ ఉద్యోగులు.

జీపీఎస్ వల్ల తమ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ గా మారుతున్నాయి.. కానీ, అత్యవసర పరిస్ధితుల్లో వారి డబ్బులు వారే వినియోగించుకునే అవకాశం లేకుండా పోయిందని సీపీఎస్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పూర్తిగా మారిపోవడం, సంవత్సరాల తరబడి దాచుకున్న డబ్బు మొత్తం కాకుండా అందులో కొంత భాగమే రిటైర్మెంట్ బెనిఫిట్ గా ఇవ్వడాన్ని సీపీఎస్ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.

అయితే, సీపీఎస్‌ ఉద్యోగులు తలపెట్టిన ఛలో విజయవాడకు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఛలో విజయవాడ నిర్వహణకు సిద్ధమైతే చట్టపర చర్యలుంటాయని హెచ్చరించారు. విజయవాడలో సెక్షన్ 30, 144 అమలులో ఉన్నాయని కమిషనర్ కార్యాలయం ప్రకటించింది.. మరోవైపు, ఛలో వరకు విజయవాడ నిర్వహించాలని చూసిన సీపీఎస్ నాయకులు పలువురిని ఇప్పటికే అరెస్టులు చేసారు పోలీసులు.. ఎవరూ ఆందోళనకు పాల్గొన్నా అరెస్ట్‌లు తప్పవని స్పష్టం చేస్తున్నారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement