Wednesday, May 1, 2024

AP : సిపిఐ సత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య అరెస్టు

శ్రీ సత్యసాయి బ్యూరో, నవంబర్ 07: (ప్రభన్యూస్)
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సత్యసాయి జిల్లా పర్యటన సందర్భంగా తెల్లవారుజాము ఐదు గంటలకే సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్యను కదిరిలో పోలీసులు అరెస్ట్ చేసి, టౌన్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సత్య సాయి జిల్లాలో ఎండిపోయిన పంట పొలాలను రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశీలించాలని డిమాండ్ చేశారు.

కరువు మండలాలుగా ప్రకటిస్తున్నారు తప్ప, కరువు సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలంవుతున్నదని, వెంటనే వలసలు పోకుండా కరువు నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వర్షాలు లేక పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర నష్టం వాటిల్లిందని అర కొర సహాయాలు కాకుండా, పూర్తిస్థాయిలో రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఉద్యోగం అవకాశాలు కల్పించాలని కోరారు. అరెస్టు అయిన వారిలో పట్టణ కార్యదర్శి లియాకత్, శివశంకర్ ,కుటాగుళ్ల హనుమంతు రెడ్డి,రైతు సంఘం నాయకులు మధు, ఏఐటియుసి నాయకులు మధునాయక్, రమేష్ బాబు, బీముడు నాయక్, చాంద్ భాష, చండ్రయుడు, ఎన్ పి కుంట రమణ తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement