Friday, May 17, 2024

బాబోయ్.. ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ రోగుల ఆవస్థలు

కరోనా విజృంభిస్తున్న వేళ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరకొర సదుపాయాలతో రోగుల ఇక్కట్లు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో అరకొర సదుపాయాలతో కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తగినంత సిబ్బంది లేకపోవడంతోపాటు డాక్టర్లు కూడా అందుబాటులో ఉండడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు.

కొత్తపేట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో 50 పడకల సామర్థ్యం ఉండగా అందులో 20 కోవిడ్ ఆక్సీజన్ బెడ్స్ గా కరోనా పేషంట్స్ కు వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ఆసుపత్రిలో సుమారు 50 మందికిపైగా రోగులు చేరారు. అయితే, ఆస్పత్రిలో కనీసం సదుపాయాలు, ఆక్సిజన్ లేక కరెంట్ కోతలతో రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలో ఉన్న 50 పడకలు రోగులతో నిండిపోవడంతో ఆస్పత్రిలో బెంచీలపై వైద్యం అందిస్తున్నారు. ప్రతీరోజు 20 వరకు ఆక్సిజన్ సిలిండర్లు అవసరమైనప్పటికీ కేవలం 7 లేదా 8 సిలిండర్లు రావడంతో రోగులు అందించడం కష్టంగా మారింది. కొందరైతే తమకు తామే సొంతంగా ఆక్సిజన్ సిలిండర్లను బయట నుండి తెచ్చుకుని పెట్టించుకుంటున్నారు. ఆస్పత్రిలో సౌకర్యాలు కల్పించాలని రోగులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement