Friday, June 21, 2024

ఏపీలో స్వాతంత్య్ర ఉద్యమం నాటి పరిస్థితులు.. జేసీ ప్రభాకర్ రెడ్డి

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాతంత్య్ర ఉద్యమం నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. దీనిపై రాష్ట్రంలో ప్రతీ ప్రాణి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. సీఎం వైఖరిని ప్రజలతో పాటు పశుపక్షాదులు కూడా ఇష్టపడటం లేదని వ్యాఖ్యనించారు. ఏపీలో మాట్లాడే హక్కు కొరవడిందని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్న చంద్రబాబు ను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. చంద్రబాబును తన సొంత నియోజకవర్గంలోకి వెళ్లనివ్వకపోవడం దారుణమన్నారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పనులను ప్రజలు ద్వేషిస్తారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement