Thursday, April 25, 2024

రెండో రోజు న‌ష్టాల‌తో ముగిసిన.. స్టాక్ మార్కెట్స్

రెండు రోజు న‌ష్టాల‌తో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. కాగా నేడు లాభాల‌తోనే ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే ట్రేడింగ్ చివర్లో సూచీలు కొంత కోలుకోవడంతో చివరకు నష్టాలు కొంత మేర తగ్గాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 304 పాయింట్లు కోల్పోయి 60,353కి పడిపోయింది. నిఫ్టీ 50 పాయింట్లు నష్టపోయి 17,992 వద్ద స్థిరపడింది. ఐటీసీ (1.91), ఎన్టీపీసీ (1.77), హిందుస్థాన్ యూనిలీవర్ (1.75), మహీంద్రా అండ్ మహీంద్రా (1.27), నెస్లే ఇండియా (1.22) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.. బజాజ్ ఫైనాన్స్ (7.21), బజాజ్ ఫిన్ సవర్వ్ (5.10), ఐసీఐసీఐ బ్యాంక్ (2.22), ఇన్ఫోసిస్ (1.32), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.09) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement