Tuesday, April 16, 2024

దేవిశ్రీ ప్ర‌సాద్ కి హ్యాండ్ మేడ్ బుక్ .. గిఫ్ట్ ఇచ్చిన క‌మ‌ల్ హాస‌న్

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కి హ్యాండ్ మేడ్ బుక్ ని గిఫ్ట్ గా ఇచ్చారు స్టార్ నటుడు కమల్ హాసన్. ఈ విషయాన్ని దేవి శ్రీప్రసాద్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.దేవిశ్రీ పోస్ట్ లో రాస్తూ.. నేనెంత అదృష్టవంతుడిని.. నా మీద ప్రేమ, నమ్మకాన్ని చూపిస్తున్నందుకు థాంక్యూ సర్.. కమల్ సార్ కొత్త కారులో నేను ఇలా ఆయనతో పాటుగా ఫోటో దిగాను.. అందులో అదిరిపోయే సౌండ్ సిస్టమ్ ఉందంటూ.. దేవి శ్రీ ప్రసాద్ ఓ ఫోటో షేర్ చేయడంతో పాటు.. ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 2022 నుంచి మరో మంచి మెమొరీ దక్కింది.

అమెరికా నుండి మన లోకనాయకుడు కమల్ హాసన్ సర్ నాకు ఈ గిఫ్ట్‌ను పట్టుకొచ్చారు. నా మీద ఆయనకు ఉన్న ప్రేమ అలాంటిది. అందుకే ఆయన ఈ గిఫ్ట్ ను తీసుకొచ్చారు అంటూ దేవిశ్రీ ప్రసాద్ చెప్పారు. ఇంతకీ ఆ సర్ ప్రైజింగ్ గిఫ్ట్ ఏంటీ అంటే.. హ్యాండ్ మేడ్ బుక్. చేతితో తయారు చేసిన పుస్తకాన్ని కమల్ హాస‌న్.. దేవిశ్రీ కోసం తీసుకోచ్చారు. అయితే అందులో ఏమున్నాయంటే.. మ్యూజిక్ నోట్స్.. ఉన్నాయి. అతే కాదు కవర్ మీద కమల్ హాసన్ మాటలు, సంతకం ఉన్నాయి. ‘నా బిడ్డ.. ఇది మీ అడ్డా..’ అంటూ పుష్ప సినిమాలోని సాంగ్ డైలాగ్ రాసుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement