Monday, April 29, 2024

24 నుంచి సీఎం కప్ ఆట‌ల‌ పోటీలు

జి.కొండూరు: కృష్ణా జిల్లా జి.కొండూరు వేదిక‌గా 24 నుంచి ఏపీ సీఎం క‌ప్ ఆట‌ల పోటీలు జ‌ర‌గ‌నున్నాయి. వాలీబాల్‌, బాల్‌బాడ్మింట‌న్‌, హాండ్‌బాల్ క్రీడాంశాల్లో సాగే ఈ పోటీలు మూడు రోజులు నిర్వ‌హిస్తారు. జిల్లా స్థాయిలో మూడు క్రీడాంశాల్లోనూ పురుషుల‌కు, మ‌హిళ‌ల విభాగాల్లో పోటీలుంటాయి. ఈ పోటీల్లో జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల నుంచి జ‌ట్లు పాల్గొంటాయ‌ని జి.కొండూరు హైస్కూల్ హెచ్ఎం రాజ‌శేఖ‌ర్ తెలిపారు. ఈ పోటీల్లో ప్ర‌తిభ చూపిన వారి నుంచి జిల్లా టీముల‌ను ఎంపిక చేస్తామ‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement