Tuesday, May 21, 2024

అంగ‌న్ వాడీ కేంద్రాల అద్దె చెల్లింపుల‌కు క‌మీష‌న్ ల గండం….

అమరావతి,ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో మళ్లి వసూళ్ల పర్వం తెరపైకి వచ్చింది. రాష్ట్రంలోని అద్దె అంగన్‌వాడీ కేంద్రాల అద్దె మొత్తాన్ని ప్రభుత్వం ఇటీవల పెంచడం కొందరు అవినీతి అధికారులకు వరంగా మారింది. రాష్ట్రప్రభుత్వం గత ఏడాది అక్టోబర్‌ నుంచి అద్దె అంగన్‌వాడీ కేంద్రాల బాడుగను పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 వేల 304 అద్దె అం గన్‌వాడీ కేంద్రాలకు ఊరట లభించింది. అరకొర సౌకర్యాలు, చాలీచాలని వసతుల తో కునారిల్లుతున్న అంగన్‌వాడీ కేంద్రాలు ప్రస్తుతం ప్రభుత్వం తీసకున్న అద్దె పెంపు నిర్ణయంతో మెరుగైన స్థితికి చేరే అవకాశాలు లభించాయి. ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం గతంలో పట్టణాల్లోని అద్దె అంగన్‌వాడీ కేంద్రాలకు రూ. 4 వేలు, గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాలకు రూ. 2 వేలు చొప్పున అద్దె మొత్తాన్ని చెల్లిం చేవారు. దశాబ్ద కాలంగా అద్దెలు పెంపునకు నోచుకోలేదు. దీంతో చాలీచాలని ఇరుకు గదుల్లోనే అద్దె అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తూ వచ్చాయి. ఈ పరిస్థితిని గమనిం చిన ప్రభుత్వం, సౌకర్యాల మెరుగుకు నిర్ణయం తీసుకుని అద్దెల మొత్తాన్ని పెం చింది. తాజాగా గత ఏడాది అక్టోబర్‌ నుంచి కొత్త అద్దెలను చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లోని కేంద్రాలకు రూ. 4 వేలకు బదులుగా రూ. 6 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 2 వేలును రెట్టింపు చేసి రూ. 4 వేలుకు పెంపుదల చేసింది. ఈ నిర్ణయంతో అం గన్‌వాడీలు కొంత ఆనందాన్ని వ్యక్తం చేసినా ఇప్పుడు ఎదు రవుతున్న ఇబ్బందులు వారిని నిరాశకు గురి చేస్తున్నాయి.

ప్రభుత్వం తాజాగా పెంచి న మొత్తంతో అద్దె బకా యిలను విడుదల చేయడం కొందరి అధికారులకు కాసులు కురిపిస్తోంది. అందిన కాడికి దండుకునే పనిలో కొన్ని జిల్లాల్లో సీడీపీవోలు ఉన్నారు. అద్దె బిల్లులు చెల్లిం చాలంటే రూ. 2 వేలు ఇస్తేనే బిల్లులు మంజూరు చేస్తామని జులుం ప్రదర్శిస్తున్నట్లుగా అంగన్‌వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు సీడీపీ వోలు అద్దె కేంద్రాల బిల్లుల చెల్లింపులకు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అం గన్‌వాడీ యూని యన్‌ నేతలు ఆరోపిస్తున్నారు. కృష్ణా, గుంటూరు, కడప, అనం తపురం, కర్నూలు జిల్లాల్లో ప్రస్తుతం ఈ వసూళ్లపై బహిరంగంగానే చర్చ జరుగు తోంది. మహిళ శిశు సంక్షేమ శాఖలో జరుగుతున్న ఈ అవినీతిపై అంగన్‌వాడీలు ఒకవైపు, మరోవైపు ఆ శాఖ పరిధిలోని అధికారులే బహిరంగంగా మాట్లాడుకుం టున్న పరిస్థితి ఉంది. కమీషన్లు చెల్లించేందుకు ఇష్టపడని కొందరు అంగన్‌వాడీలు అధికారులను ప్రశ్నిస్తే, రకరకాల ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలున్నా యి. ప్రభుత్వ నిబం ధనల ప్రకారం అద్దె కేంద్రంలో వసతులు లేకపోవడం కొలతలు, గదుల సంఖ్యలో కూడా తేడాలున్నాయని బిల్లులు పెండింగ్‌ పెడుతున్నట్లుగా ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదికి సంబంధించి సెప్టెంబర్‌ నెల పాత అద్దెతో పాటు అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ నెలలకు సంబంధించి కొత్త అద్దెలను ప్రభుత్వం మం జూరు చేసింది. ఈ నగదు అంగన్‌వాడీల అకౌంట్లలో నేరుగా జమ అయినప్పటికీ రూ. 2 వేలు అనధికారికంగా కొందరు సీడీపీవోలు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే టీఏ, డీఏలకు సంబంధించిన బిల్లులు కూడా ఏళ్ల తర బడిగా పెండింగ్‌ ఉండటం ఇలాంటి సమయంలో అద్దె పెంపు నిధులు వచ్చినా ఫలితం లేదని అంగన్‌ వాడీలు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాల్లో అనధికారి కంగా జరుగుతున్న ఈ కమీషన్ల పర్వానికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అంగన్‌వాడీ వర్కర్లు, యూనియన్లు
విజ్ఞప్తి చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement