Friday, April 26, 2024

మంత్రి రోజాకి.. కౌంటర్ ఇచ్చిన కమెడియన్ గెటప్ శ్రీను

సోషల్ మీడియా వేదికగా మంత్రి రోజాకి జబర్థస్త్ నటుడు గెటప్ శ్రీను కౌంటర్ ఇచ్చాడు. రోజా తాజాగా చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్, నాగబాబులపై కొన్ని సీరియస్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. రోజా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీను సోషల్ మీడియాలో పెట్టిన ఆ పోస్ట్ దూమారం రేపుతోంది. శ్రీను ..మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే..తాజాగా రోజా మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌తో పాటు చిరంజీవి, నాగబాబులను జనం ఓడించారంటే వారికి రాజకీయ భవిష్యత్తు లేదనే విషయం అర్థమవుతోందని.. సినీ నటులు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు.. అందరికీ సాయం చేస్తారు కానీ.. వీళ్లు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారని కామెంట్ చేశారు.

ఈ నేపథ్యంలో రోజాకు శ్రీను కౌంటర్ ఇచ్చారు. చిరంజీవి గారి .. సేవా గుణ , దాన గుణం తెరిచిన పుస్తకం ..ఒక స్ఫూర్తి. మరి మీకెందుకు కనపడలేదో.. రోజగారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేస్కోండి. మీ ఉనికి కోసం.. ఆయన మీద విమర్శలు చేసి ప్రజల్లో మీ మీదున్న గౌరవాన్ని కోల్పోకండి.. మీ నోటనుండి ఇంత పచ్చి అబద్దాన్ని వినాల్సివస్తుందని అనుకోనేలేదు. దయచేసి మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీస్కోండంటూ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement