Thursday, May 2, 2024

AP : బాబా జయంతి వేడుకల ఏర్పాట్లు పై కలెక్టర్ సమీక్ష

శ్రీ సత్యసాయి బ్యూరో, నవంబర్ 09: (ప్రభన్యూస్) ఈనెల 23వ తేదీన శ్రీ సత్య సాయి బాబా జయంతి వేడుకలకు సంబంధించి గురువారం స్థానిక కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. 98 శ్రీ సత్య సాయి జయంతి ఉత్సవాలపై జిల్లా అధికారులతో , ట్రస్ట్ మెంబర్లతో జయంతి వేడుకల ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం చర్చించారు.

ఇందులోజిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, స్థానిక ఎమ్మెల్యే డి .శ్రీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్, డిఆర్ఓ కొండయ్య, ట్రస్ట్ ప్రతినిధులు వాసుదేవన్, నారాయణ తదితరులు హాజరయ్యారు.
శ్రీ సత్యసాయి బాబా జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాట్ల విషయమై ఎలాంటి లోటుపాట్లు ఎదురుకాకుండా చూడాలని  కోరారు. స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ   ఈనెల  18 నుండి 24వ తేదీ వరకు జరిగే ఉత్సవాలు వివిధ శాఖల అధికారులకు కేటాయించిన విధులను సక్రంగా నిర్వహించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement