Monday, December 9, 2024

13న విశాఖలో సీఎం జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. ఆ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారైంది. ఈనెల 13వ తేదీన సీఎం జగన్ విశాఖలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వాహనమిత్ర లబ్దిదారులతో సమావేశమై వారికి చెక్కులను పంపిణీ చేయనున్నారు. అలాగే వాహనమిత్ర లబ్దిదారులతో ముఖామఖి సమావేశం ఫొటో సెషన్‌ ఉంటుంది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలిస్తారు. ఆ తర్వాత అక్కడి బహిరంగ సభలో జగన్‌ ప్రసంగిస్తారు. సమావేశంలో లబ్దిదారులకు చెక్కులు అందజేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement