Saturday, April 27, 2024

తిరుపతి పర్యటనకు ఏపీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ రెండు రోజుల నిమిత్తం తిరుపతి పర్యటనకు వెళ్తున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు గన్నవరం నుంచి రేణిగుంటకు బయల్దేరి వెళ్తారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో రేణిగుంటకు చేరుకునే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు జగన్‌ స్వాగతం పలుకుతారు. అనంతరం అక్కడి నుంచి తిరుమల బయలుదేరి వెళతారు. రాత్రి 9.30 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుంటారు, ఆ తర్వాత రాత్రి రేణిగుంట చేరుకుని తిరిగి తాడేపల్లి బయలుదేరుతారు. రేపు మధ్యాహ్నం 1.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి తిరుపతి బయలుదేరుతారు, మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరుపతి తాజ్‌ హోటల్‌లో జరగనున్న సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి 

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement