Tuesday, April 16, 2024

AP | రేపు విశాఖ పర్యటనకు సీఎం జగన్

సీఎం వైఎస్ జగన్ రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా విజన్ విశాఖ సదస్సులో వివిధ రంగాల వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ కానున్నారు. అనంతరం స్కిల్ డెవలప్‌మెంట్, ఎంప్లాయ్‌మెంట్, సీడాప్ కింద ఉపాధి పొందిన యువతతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు.

రేపు ఉదయం 9.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. రాడిసన్ బ్లూ రిసార్ట్స్‌లో జరిగే విజన్ విశాఖ సదస్సులో వివిధ రంగాలకు చెందిన వ్యాపారులు, పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ కానున్నారు. ఆ తర్వాత పీఎంపాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని స్కిల్ డెవలప్‌మెంట్, ఎంప్లాయిమెంట్, సీడాప్ కింద ఉపాధి పొందిన యువతతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. అనంతరం బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement