Monday, October 7, 2024

22 ఏళ్ళ తర్వాత కలుసుకున్న ‘మన్మథుడు’ జోడి

నాగార్జున హీరోగా 22ఏళ్ళ క్రిందట టాలీవుడ్ లో రిలీజ్ అయిన‌ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘మన్మథుడు’. ఈ సినిమాలో సోనాలి బెంద్రే మెయిన్ హీరోయిన్ గా నటించగా, అన్షు అంబానీ సెకండ్ హీరోయిన్ గా నటిస్తూ సినీ కెరీర్ ని స్టార్ట్ చేశారు. ఫ్లాష్‌బ్యాక్ లో వచ్చే అన్షు, నాగ్ పెయిర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. మొదటి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించినప్పటికీ ఆడియన్స్ లో మంచి గుర్తింపునే సంపాదించుకున్నారు అన్షు.

ఆ తరువాత ప్రభాస్ తో ‘రాఘవేంద్ర’, శివాజీ ‘మిస్సమ్మ’ సినిమాలో ఓ అతిథి పాత్ర, తమిళంలో హీరోయిన్ గా ఓ సినిమా చేసి కెరీర్ కి ఫుల్‌స్టాప్ పెట్టేశారు. పెళ్లి చేసుకొని కుటుంబంతో లండన్ లో స్థిరపడిన అన్షు సినిమాలకు గుడ్ బై చెప్పేసారు. అయితే తాజాగా తన మొదటి హీరో నాగార్జునని కలుసుకున్నారు అన్షు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇటీవల మన్మథుడు సినిమా రీ రిలీజైన తరువాత మళ్ళీ వార్త‌ల్లోకి వ‌చ్చారు అన్షు. మన్మథుడు రీ రిలీజ్ తరువాత హైదరాబాద్ తిరిగి వచ్చిన అన్షు వరుస ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement