Monday, May 20, 2024

AP | పింఛన్ల పంపిణీపై క్లారిటీ..

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ దృష్ట్యా వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ క్రమంలో పింఛన్ల పంపిణీపై నెలకొన్న అనిశ్చితిపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఉండదని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) వెల్లడించింది.

అయితే, లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సచివాలయాలకు వెళ్లి ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డుతో పింఛను పొందాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో సచివాలయంలోనే పింఛన్లు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఏప్రిల్ 3 నుంచి సచివాలయాల్లో పింఛన్ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు.

కాగా, ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని శనివారం కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. దాంతో పాటు ఎలాంటి సంక్షేమ పథకాలకు వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేయించవద్దని ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీలో ఎన్నికల కోడ్ ముగిసే వరకూ వాలంటీర్లకు ఇచ్చిన ట్యాబ్స్, మొబైల్స్ ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్ చేసుకోవాలని స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement