Wednesday, May 15, 2024

వకుల మాత ఆలయం భక్తులకు మెరుగైన వసతులు

తిరుపతి సిటీ : పేరురూ బండపై వెలసిన మాతృశ్రీ వకుల మాత ఆలయాన్ని టీటీడీ బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్ సందర్శించారు. బుధవారం భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి మాతృమూర్తి వకుళ మాత ఆలయాన్ని వ్యయ ప్రయాసలతో రెండు సంవత్సరాల కాల వ్యవధిలో 17 కిలోల బంగారంతో విమాన గోపురాన్ని, వకుళ మాత దేవి విగ్రహాన్ని బంగారంతో తాపడం చేయించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈనెల 23న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చే ప్రారంభించబడింది.

వారి చేతుల మీదుగా టీటీడీ అధికారులకు అప్పగించడం జరిగింది. 200 మంది భక్తులతో మొదటి రోజు వస్తే నిన్నటికి సుమారు రెండు వేల మంది వరకు భక్తులు పెరిగారు, ఈ ఆలయాన్ని మంత్రి ఆశయం మేరకు అన్ని రకాలుగా అభివృద్ధి చేయించుటకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సుమారు 30 కోట్లకు పైగా వెచ్చించి వకుళ మాత ఆలయాన్ని భక్తుల సందర్శనార్థం తీసుకు రావడం జరిగిందని తెలియజేశారు. సుమారు 83 ఎకరాల స్థలంలో అమ్మవారి ఆలయం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. భక్తులకు మరింత సౌకర్యాలు అందించేలా చర్యలు చేపడుతున్నామ‌న్నారు. సుమారు వెయ్యి మంది పాల్గొనేలా టీటీడీ ఆధ్వర్యంలో కల్యాణ మండపం, ఆలాగే ఉద్యాన వనం ఏర్పాటు చేస్తామ‌న్నారు. అమ్మవారిని దర్శనం చేసుకునేలా ప్రచారంతో పాటు సూచిక బోర్డులను ఏర్పాటు చేసామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో వరలక్ష్మి నాయకులు బండ్ల లక్ష్మీపతి టిటిడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement