Wednesday, May 15, 2024

చిత్తూరు మేయర్ గా ఎస్. అముద

చిత్తూరు ప్రతినిధి, : నగరపాలక సంస్థ మేయర్ గా 39వ వార్డ్ సభ్యురాలు ఎస్.అముద, డిప్యూటీ మేయర్ గా 16వ వార్డుసభ్యులు ఆర్.చంద్రశేఖర్ లు ఎన్నికయ్యారు.గురువారం నగరపాలక సంస్థకు ఎన్నికైన నూతన వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార సమావేశం జరిగినది.అనంతరం మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కార్యక్రమం ప్రిసైడింగ్ అధికారి‌, జిల్లా సంయుక్త పాలనాధికారి డి.మార్కండే యులు గారి ఆధ్వర్యంలో ప్రశాంతంగా జరిగింది. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం మొదటగా నూతనంగా ఎంపికైన వార్డు సభ్యుల హాజరు ను రిజిస్టర్ లో నమోదు చేసి వారి చేత ఎన్నికల నియమావళిని అనుసరించి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక ప్రక్రియ చేపట్టారు. మేయర్ ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్సిపి నుంచి అందిన బీఫామ్ ప్రకారం 39వ వార్డు సభ్యురాలు ఎస్.అముద మేయర్ అభ్యర్థిగా ప్రకటించగా… 45వ వార్డు సభ్యులు జి. జ్ఞాన జగదీష్ ప్రతిపాదించగా, 5వ వార్డు డివిజన్ సభ్యులు సి హరిణీ రెడ్డి బలపరిచారు. దీంతో ఎస్.అముద ను మేయర్ గా ఎన్నుకున్నారు. ఇదే తరహాలో డిప్యూటీ మేయర్ గా 16 వ వార్డు సభ్యులు ఆర్.చంద్రశేఖర్ ను ప్రకటింగా… 36వ వార్డు సభ్యులు ఎస్.హుసేన్ అలీషా ప్రతిపాదించగా.. 26వ వార్డు సభ్యులు వి.చల్లముత్తు బలపరిచారు. అనంతరం ఆర్ చంద్రశేఖర్ ను డిప్యూటీ మేయర్ గా ఎన్నుకున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన.. ఎస్.అముద, ఆర్.చంద్రశేఖర్ లకు ప్రిసైడింగ్ అధికారి, జిల్లా సంయుక్త పాలనాధికారి డి. మార్కొండేయులునగర కమిషనర్ పి.విశ్వనాథ్ లు డిక్లరేషన్లు అందించి అనంతరం పుష్పగుచ్ఛాల తో అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎక్స్ అఫిషియో సభ్యుల హోదా లో చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు, ఎమ్మెల్సీ రాజసింహులు హాజరయ్యారు..

నగర అభివృద్ధి కోసం …
చిత్తూర్ నగర అభివృద్ధికి ఉత్తమ సహాయ శక్తుల కృషి చేస్తామని నూతన నగర మేయర్ ఎస్. ఆముద , డిప్యూటీ మేయర్ ఆర్ .చంద్ర శేఖర్ లు అన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం వార్డు సభ్యులతో సమావేశానికి విచ్చేసిన అధికార యంత్రాంగం తో సమావేశమయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్సార్ పార్టీ అమలు చేస సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా పట్టణ ప్రణాళిక లో భాగంగా చిత్తూరు నగరానికి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు ఇందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం సైతం సలహాలు సూచనలతో కార్యాచరణను రూపొందించి ముందుకు వెళతామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement