Thursday, May 2, 2024

మిస్‌ సౌత్‌ ఇండియా-2022ని కైవసం చేసుకున్న‌ ‘చరిష్మాకృష్ణ’..

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ : పెగసిస్‌ గ్లోబల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కొచ్చి నిర్వహించిన అమృతవేణి మన్నాపురం మిస్‌ సౌత్‌ ఇండియా-2022 టైటిల్‌ని వైజాగ్‌ అమ్మాయి చరిష్మాకృష్ణ కైవసం చేసుకున్నారు. లెమెరిడియన్‌ కన్‌వెన్షన్‌ సెంటర్‌ కొచ్చిలో ఆగస్టు ఒకటిన జరిగిన ఈ పోటీలో దక్షిణ భారతదేశ ఐదు రాష్ట్రాల నుండి ఇరవై మంది పోటీ పడ్డారు. ఆంధ్రాయూనివర్సిటీలో బేచెలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ చదువుతున్న చరిష్మాకృష్ణ 2021లో అజేమ్‌ అగర్వాల్‌ మిస్‌ వైజాగ్‌ పోటీలో సెకెండ్‌ రన్నరప్‌గా నిలిచింది. మిస్‌ సౌత్‌ ఇండియా పోటీలో రెండవ స్థానంలో, తమిళనాడుకి చెందిన డెబినితాకార్‌, మూడవ స్థానంలో కర్ణాటక కి చెందిన సమ్రుద్దదీశెట్టి నిలిచారు. పెగసిన్‌ వారు ఇరవై సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న మిస్‌ సౌత్‌ ఇండియా పోటీలలో ఆంధ్రా అమ్మాయికి ఈ ఘనత దక్కడం మొట్ట మొదటి సారిగా ఈ గౌరవం దక్కించుకున్నారు. విజేతగా నిలిచిన చరిష్మాకృష్ణకి లక్ష రూపాయల విలువైన బహుమతులు పెగసిన్‌ ఛైర్మెన్‌ డాక్టర్‌ అజిత్‌ రవి అందజేశారు. ఈ పోటీకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన మళయాళం సినీ నటుడు షీజా రషీద్‌, ప్రముఖ పారిశ్రామిక వేత్త బియా సందుతనేత, కాస్మాలజిస్టు డాక్టర్‌ తామస్‌ నెచ్చుపాదం , డాక్టర్‌ జయశ్రీ చంద్రమోహన్‌ (ఫిట్నెస్‌ ట్రైనర్‌) .

ఈ కార్యక్రమానికి ప్రముఖ మోడల్‌ కొంచితా జాన్‌, క్వీన్స్‌ అండ్‌ క్వీన్స్‌ ఎండి సుజేష్‌ షణ్మగమ్‌ గ్రూమర్స్‌గా వ్యవహరించారు. అంతర్జాతీయ ఫేషన్‌ కొరియో గ్రాఫర్‌ సమీర్‌ ఖాన్‌ ఈకార్యక్రమంలో తన కొరియోగ్రఫీ అందజేశారు. కాస్ట్యూమ్‌ డిజైన్‌ విశాఖ ఫేషన్‌ సాండీ , అనైనా బాటిక్‌ వారు భారతీ చెర్రి పేజెంట్‌ గ్రూమర్‌గా వ్యవహరించారు. నందన్‌ పెర్రి వీడియో గ్రఫీ చేశారు. ఈ కార్యక్రమానికి బ్రొడేవేడాన్స్‌ అకాడమీ షరత్‌, హిత్‌ ద డాస్‌ ఫ్లోర్‌ఒ రాజేష్‌, పోటో గ్రాఫర్‌ సాయి కిరణ్‌ తమ సహకారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా యూనివర్షిటీ వైస్‌ ఛాన్సలర్‌ పి.వి.జెడి ప్రసాదరెడ్డి , డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ అఫైర్స్‌ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ సంధర్బంగా ఈవెంట్‌ మేనేజర్‌ భరత్‌ కంటమ్‌ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement