Sunday, April 21, 2024

AP | పవన్ కల్యాణ్ భీమవరం పర్యటనలో మార్పులు..

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20వ తేదీన పవన్ కల్యాణ్ భీమవరంలో పర్యటించాల్సి ఉంది. అయితే, పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి.. పవన్ పర్యటన 21వ తేదీకి వాయిదా పడింది.

21‌వ తేదీన పవన్ కల్యాణ్ ఉదయం 10 గంటలకు మంగళగిరి నుండి హెలికాప్టర్ లో భీమవరం కాస్మోపాలిటిన్ క్లబ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుండి నిర్మల ఫంక్షన్ హాల్ కు చేరుకుని జనసేన-టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతారు అని భీమవరం జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు.

రెండు రోజుల పాటు విశాఖలో ఉత్తరాంధ్ర జిల్లా నేతలతో అంతర్గత చర్చలు నిర్వహించిన అనంతరం ఇవ్వాల (సోమవారం) సాయంత్రం విశాఖ నుంచి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. రేపు ఉభయ గోదావరి జిల్లాల నేతలతో పవన్‌ కల్యాణ్‌ అంతర్గత చర్చలు నిర్వహించనున్నారు. జనసేనతో పాటు టీడీపీ నేతలతో ఉమ్మడిగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నారు. రెండు రోజులపాటు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించె అవకాశం ఉంది. ఇక రాజమండ్రిలో సమావేశాలు ముగిసిన అనంతరం పవన్‌ కల్యాణ్‌ అక్కడ నుంచి భీమవరం వెళ్ళనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement