Sunday, April 28, 2024

బ్రేక్‌ దర్శన వేళల్లో మార్పు

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమల శ్రీవారి ఆలయంలో అమలవుతున్న బ్రేక్‌ దర్శన సమయంలో మార్పును గురువారం నుంచి అమలులోకి వచ్చింది. వేకువజామున 3 గంటల సమయంలో శ్రీవారి ఆలయానికి వచ్చిన అర్చకులు ఆలయశుద్ది నిర్వహించిన తరువాత సుప్రభాతసేవతో స్వామివారిని మేల్కొపిన అనంతరం సుప్రభాతసేవ దర్శనానికి భక్తులను అనుమతించి, తదుపరి తోమాల, అర్చన సేవలను నిర్వహించి గతంలో లాగే ఈ సేవల సమయంలో సర్వదర్శనం కోసం వైకుంఠం కాంప్లెక్సులో వేచివున్న భక్తులను దర్శనానికి అనుమతించి సేవలు ముగిసిన తరువాత మూలవర్లకు నైవేద్యం సమర్పించి, ఉదయం 6.30 నుంచి 8 గంటల వరకు సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించి, 8 గంటల నుంచి విఐపిబ్రేక్‌ (ప్రజాప్రతినిధులు సిఫారసు) దర్శన టికెట్లు పొందిన భక్తులను ముందుగా దర్శనానికి అనుమతించి 10 గంటల సమయంలో స్వామివారికి రెండవఘంట నైవేద్యం సమర్పించి తిరిగి 10.30 గంటల సమయంలో ప్రోటోకాల్‌ పరిధిలోని ప్రముఖులను దర్శనానికి అనుమతించారు.

అటు తర్వాత శ్రీవాణిట్రస్టు టికెట్లు పొందిన భక్తులను దర్శనానికి టీటీడీ అనుమతించింది. గురువారం నుంచి బ్రేక్‌ దర్శన సమయాన్ని మర్చడంతో శ్రీవాణి టికెట్లు కలిగిన భక్తులతో పాటు కొంతమంది బ్రేక్‌ దర్శన టికెట్లు కలిగిన భక్తులు ఇబ్బందులకు గురయ్యారని, రాబోవు రెండురోజుల్లో భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తామని టిటిడి చైర్మెన్‌ వైవి.సుబ్బారెడ్డి

తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement