Tuesday, March 26, 2024

దూసుకెళ్లిన జీఎస్టీ ఆదాయం.. నవంబరు నెలలో పెరిగిన వసూళ్లు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో నవంబరు మాసంలో జీఎస్టీ కలెక్షన్లు మరోసారి దూకుడును ప్రదర్శించాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 14 శాతం మేర అధికంగా ఈ వసూళ్లు రికార్డయ్యాయి. తెలంగాణలో ఈ సంఖ్య ఎనిమిది శాతానికే పరిమితమైంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఈపన్నుల వసూళ్లు పెరిగాయి. జాతీయ స్థాయిలో గత ఏడాది ఇదే నెలతో పోల్చుకుంటే 11 శాతం మేర పెరుగుదల కనిపించింది. కేంద్ర ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. నవంబర్‌లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జీఎస్టీ వసూళ్లు రూ. 1,45,867 కోట్లగా నమోదయ్యాయి. గత ఏడాది నవంబర్‌తో పోల్చుకుంటే ఇది 11 శాతం అధికం. 2021 నవంబర్‌లో నమోదైన జీఎస్టీ వసూళ్లు రూ. 98,708 కోట్లు కాగా, ఈఏడాది అదే నవంబర్లో రూ. 1,45,867 కోట్లకు చేరింది . జాతీయ స్థాయిలో వసూళ్లలో సీజీఎస్టీ వాటా రూ. 25,681 కోట్లు, ఎస్జీఎస్టీ రూ. 32,651 కోట్లు, ఐజీఎస్టీ రూ. 77,103 కోట్లుగా నమోదయ్యాయి. సెస్‌ రూపంలో అందిన మొత్తం రూ.10,433 కోట్లుగా నమోదయ్యాయి.

దిగుమతి చేసుకున్న వస్తువులపై వసూలు చేస్తోన్న సెస్‌ వల్ల రూ. 817 కోట్ల మొత్తాన్ని కూడా ఇందులోనే కలిపారు. ఇక ఏపీలో జీఎస్టీ వసూళ్లు మరోసారి భారీగా పెరిగాయి. ఈ పెరుగుదల 14 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే నవంబర్లో వచ్చిన జీఎస్టీ వసూళ్లు రూ. 2,750 కోట్లు కాగా, ఈ సంవత్సరం అదే నవంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ. 3,134 కోట్లకు పెరిగాయి. తెలంగాణతో పోల్చుకుంటే ఆరు శాతం అధికంగా ఏపీలో జీఎస్టీ వసూళ్లు రికార్డయ్యాయి. తెలంగాణలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు 8 శాతంగా నమోదైంది. తెలంగాణలో కిందటి నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 4,228 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో రూ. 3,931 కోట్ల మేర జీఎస్టీ రూపంలో అందాయి.

రాష్ట్రాలవారీగా.. ఇలా..

- Advertisement -

రాష్ట్రాలవారీగా చూసుకుంటే.. జమ్మూ కాశ్మీర్‌లో రూ.430 కోట్లు, హిమాచల్‌ ప్రదేశ్‌లో రూ.67 కోట్లు, పంజాబ్‌లో రూ.1,669 కోట్లు, చండీగఢ్‌లో రూ.175 కోట్లు, ఉత్తరాఖండ్‌లో రూ.1,280 కోట్లు, హర్యానాలో రూ.6,769 కోట్ల వంతున జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో రూ.4,566 కోట్లు, రాజస్థాన్‌లో రూ.3,618 కోట్లు, ఉత్తర ప్రదేశ్‌లో రూ.7,284 కోట్లు, బిహార్‌లో రూ.1,317 కోట్లు, సిక్కింలో రూ.209 కోట్లు, అరుణాచల్‌ ప్రదేశ్‌లో రూ.62 కోట్లు, నాగాలాండ్‌లో రూ.34 కోట్లు, మణిపూర్‌లో రూ.50 కోట్లు, మిజోరంలో రూ.24 కోట్లు, త్రిపురలో రూ.60 కోట్లుగా నమోదయ్యాయి. మేఘాలయలో రూ.162, అస్సాంలో రూ.1,080 కోట్లు, పశ్చిమబెంగాల్‌లో రూ.4,371 కోట్లు, జార్ఖండ్‌లో రూ.2,551 కోట్లు, ఒడిశాలో రూ. 4,162 కోట్లు, ఛత్తీఘఢ్‌ లో రూ.2,448 కోట్ల వంతున జీఎస్టీ రెవెన్యూను అందుకున్నాయి. మధ్యప్రదేశ్‌లో రూ.2,890 కోట్లు, దాద్రానగర్‌ హవేలిలో రూ.304 కోట్లు, గుజరాత్‌లో రూ. 9,333 కోట్లు వంతున రికార్డయ్యాయి. మహారాష్ట్రలో రూ.21,611 కోట్లు, కర్ణాటకలో రూ.10,238 కోట్లు, గోవాలో రూ.447 కోట్లు, కేరళలో రూ.2,094 కోట్లు, తమిళనాడులో రూ.8,551 కోట్లు, పుదుచ్చేరిలో రూ.209 కోట్లు, అండమాన్‌ నికోబార్‌లో రూ.23 కోట్ల మేర జీఎస్టీ కలెక్షన్లు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement