Wednesday, May 1, 2024

AP: కోనసీమలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పర్యటన…

ఇవాళ కోనసీమలోని అమలాపురం, పి.గన్నవరంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో జరగబోయే ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొననున్నారు.

- Advertisement -

మధ్యాహ్నం అంబాజీపేట, సాయంత్రం అమలాపురం బహిరంగ సభలో పాల్గొననున్న టీడీపీ అధినేత, జనసేనాని. బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు పూర్తి చేశారు.

ట్రాఫిక్ మళ్లింపు….

చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి బహిరంగ సభ దృష్ట్యా అమలాపురంలో ట్రాఫిక్ మళ్లింపు చేయనున్నారు. అమలాపురం మీదుగా వెళ్ళు వాహనాలకు అమలాపురం పట్టణంలోకి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అనుమతి లేదు. కాకినాడ, రాజమండ్రి, రాజోలు, పి.గన్నవరం వైపు వెళ్ళే వాహనాలను వివిధ మార్గాల్లో మళ్ళింపు చేపట్టనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement