Sunday, October 6, 2024

AP High Court: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో…నేడు ఏపీ హైకోర్టులో విచారణ

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ దాఖలుపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ చేయ‌నున్నారు. ఇప్పటికే 470 పేజీలతో కూడిన అడిషనల్ అఫిడవిట్‌ను సీఐడీ అధికారులు దాఖలు చేశారు.

బెయిల్ ఇవ్వొద్దని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్‌లో అవకతవకలు జరిగాయని అడిషనల్ అఫిడవిట్‌లో సీఐడీ పేర్కొంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ‌ తన వాదనలను సీఐడీ అధికారులు హైకోర్టు న్యాయమూర్తికి వినిపించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement