Thursday, May 2, 2024

ప్రైవేట్ టీచర్ల కష్టాలపై చంద్రబాబు ఆవేదన

కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయిన తీవ్ర కష్టాల పాలవుతున్నారు. ముఖ్యంగా ప్రైవేటు ఉపాధ్యాయులు అష్టకష్టాలు పడుతున్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కూలి పనులకు వెళ్లడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రైవేటు ఉపాధ్యాయులకు ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. ప్రైవేటు టీచర్లను ఆదుకోవాలని కోరినా ప్రభుత్వంలో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి కోల్పోయిన టీచర్ల కుటుంబాలకు రూ.10 వేలు తక్షణ సాయంగా అందించాలని కోరారు. కరోనా పరిస్థితులు ఉన్నంతకాలం ప్రైవేటు టీచర్లకు నెలకు రూ.7,500 చొప్పున ఇవ్వాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement