Tuesday, May 21, 2024

Kurnool : రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

కర్నూలు నగరంలో శనివారం చైన్ స్నాచర్స్ హల్ చల్ చేశారు. ఉదయం కర్నూలు నగరంలోని బుధవారపేట, కృష్ణానగర్, బాలాజీ నగర్​లలో ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి మహిళల మెడలో ఉన్న బంగారు గొలుసులను దొంగిలించేందుకు తెగబడ్డారు. బుధవారపేటలో ఇంటి ముందున్న ఓ మహిళ మెడలో ఐదు తులాల బంగారు గొలుసులు దుండగులు లాకెళ్ళారు. కృష్ణానగర్ వద్ద ఓ మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసు లాగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మహిళ కిందపడింది. అప్రమత్తమైన ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు వచ్చి దొంగలను పట్టుకునేందుకు వారి వెంటపడ్డారు. దొంగలు స్థానిక ప్రజలకు దొరక్కుండా బైక్ పై వేగంగా ప్రయాణించి తప్పించుకున్నారు.

ఇదే తరహాలో బాలాజీ నగర్​లో కూడా గొలుసు దొంగలు ఓ మహిళ మెడలో బంగారు గొలుసును లాక్కెళ్లే ప్రయత్నం చేయగా.. మహిళ గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుండి పరారయ్యారు. వరుసగా చోటుచేసుకున్న ఈ ఘటనలపై కర్నూలు మూడవ పట్టణ, తాలూకా పోలీస్ స్టేషన్​లో కేసులు నమోదయ్యాయి. కర్నూలు నగరంలో ఒకేరోజు మూడు ప్రదేశాల్లో చైన్ స్నాచింగ్ జరగడంతో మహిళలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement