Tuesday, May 21, 2024

Mob Torches – మ‌ణిపూర్ లో ఆగ‌ని విధ్వంసం – మంత్రి గోడౌన్ కు నిప్పు..

ఇంపాలా – జాతి ఘర్షణలు మణిపూర్‌ను నిప్పుల కుంప‌టిగా మార్చాయి… ఈశాన్య రాష్ట్రంలో గ‌త నెల మే 3 రెండు తెగ‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు కొన‌సాగుతున్నాయి… తాజా పరిణామంలో ఇంఫాల్ తూర్పు జిల్లాలోని చింగారెల్‌లో మణిపూర్ మంత్రి ఎల్ సుసీంద్రో ప్రైవేట్ గోడౌన్‌ను కొంతమంది వ్యక్తులు తగులబెట్టారు. ఆస్తి బూడిదగా మారిందని పోలీసులు శనివారం తెలిపారు.

గ‌త‌ రాత్రి ఇదే జిల్లాలోని ఖురాయ్‌లోని మంత్రికి చెందిన మరో ఆస్తికి, ఆయన నివాసానికి కూడా నిప్పుపెట్టే ప్రయత్నం కూడా జరిగిందని వారు తెలిపారు. అయితే, సకాలంలో జోక్యం చేసుకోవడం వల్ల వారిని ఆపగలిగామని పోలీసులు వెల్లడించారు. కాగా, మంత్రి నివాసం నుంచి ఆ గుంపును చెదరగొట్టేందుకు బలగాలు అర్ధరాత్రి వరకు అనేక రౌండ్లు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement