Sunday, April 28, 2024

Accident – ఆవును ఢీకొట్టిన బాపురావు కారు – ప్రాణాలతో బయటపడ్డ ఎమ్మెల్యే

నిర్మల్‌: ఆదిలాబాద్‌లోని బోథ్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావుకి పెను ప్రమాదం తప్పింది. నిర్మల్‌ బైపాస్ సమీపంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ఆవును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా.. ఎమ్మెల్యే చేతి వేళ్లకు గాయమైంది. వెంటనే మరో వాహనంలో ఎమ్మెల్యేను ఆదిలాబాద్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ వెంటనే ఆయన వేరే కారులోతన నివాసానికి చేరుకున్నారు.. తనకు స్వల్పగాయం అయిందని, ఎవరూ కంగారుపడాల్సిన పనిలేదని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement