Wednesday, May 1, 2024

Recovery Record – అనంత పోలీసుల సరికొత్త రికార్డు.. ఏకంగా 8309 సెల్ ఫోన్ల రికవరీ….

అనంతపురం బ్యూరో ( ప్రభ న్యూస్ ) దొంగలపాలైన సెల్ ఫోన్లను రికవరీ చేసి.. బాధితులకు అప్పజెప్పటంలో అనంతపురం పోలీసులు దేశంలోనే అగ్ర స్థానంలోనిలిచారు. రూ. 56 లక్షల విలువ చేసే 305 సెల్ ఫోన్లను జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ శనివారంబాధితులకు అందజేశారు.వీటిల్లో271 పోగొట్టుకున్నవి కాగా…34 అపహరణకు గురైన మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పటి వరకూ 8309 సెల్ ఫోన్లు రికవరీ చేశారు. వీటన్నింటి విలువ సుమారు రూ. 13.67 కోట్లు ఉంటుందని అంచనా. జిల్లాలో ప్రజల మొబైల్ ఫోన్లను తస్కరించి ఇతర రాష్ట్రాలకు తరలించినా రికవరీలో రాజీ పడకుండా పోలీసులు దొంగలపనిపట్టారు.శనివారం ఎనిమిది జిల్లాల బాధితులకు సెల్ ఫోన్లు అందజేశారు. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలకు తరలించిన ఫోన్లనూ రికవరీ చేయించారు.

చోరీకి గురైతే ఇలా చేయండి..
ఫోన్ చోరీకి గురైనా మిస్ అయినా చాట్ బాట్ లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సీఈఐఆర్ లో నమోదు చేసుకోవాలని ఎస్పీ తెలిపారు. సీఈఐ ఆర్ లో ఎలా నమోదు చేసుకోవచ్చో చాట్ బాట్ లో సూచనలు చేసిన‌ట్టు ఎస్పీ తెలిపారు. వెంటనే సిమ్, ఐ ఎం ఈ ఐ నంబర్లను బ్లాక్ చేస్తారు. దీనివల్ల సదరు మొబైల్ నంబర్ , మొబైల్ ఫోన్ లో ఉన్న విలువైన సమాచారం దుర్వినియోగం కాకుండా ఉండే వీలు ఉంటుంది.జిల్లా పోలీస్ సైబర్ విభాగం సీఐ షేక్ జాకీర్ సిబ్బందిని అభినందించడమే కాకుండా సెల్ ఫోన్ల రికవరీలో మంచి కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. బిల్లు లేకుండా సెల్ ఫోన్ అమ్ముతామంటు నమ్మబలికే వ్యక్తులు సెల్ ఫోన్ దుకాణాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, తదితర ప్రాంతాలలో అనుమానాస్పదంగా సంచరించే వారిపై సమీపంలోని పోలీసు స్టేషన్ కు లేదా జిల్లా ఎస్పీ మొబైల్ ఫోన్ 9440796800 కు సమాచారం చేరవేయాలని జిల్లా ఎస్పీ తన ఫోను నంబర్ను వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement