Monday, May 6, 2024

రైస్ మిల్ యజమానిపై సీబీఐ కేసు.. తప్పుడు పేపర్లతో బ్యాంకుకు మోసం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మోసగించిన కేసులో నెల్లూరుకు చెందిన నలుగురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. టర్మ్ లోన్, బ్యాంక్ గ్యారంటీ సహా వివిధ రూపాల్లో మొత్తం రూ. 61.71 కోట్ల మేర మోసం చేశారని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేయడంతో సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. వ్యాపారానికి సంబంధం లేని వ్యక్తులకు ఆ నిధులను దారిమళ్లించినట్టు బ్యాంకు గుర్తించింది.

అలాగే తప్పుడు పత్రాలను సృష్టించి అధికమొత్తంలో టర్నోవర్ ఉన్నట్టుగా పేర్కొన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన వెంటనే నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినట్టు సీబీఐ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఫిర్యాదు మేరకు నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి రైస్ మిల్, దాని యాజమాన్యం కంద్ర ప్రసన్నకుమార్ రెడ్డి, కంద్ర ప్రతిమ, కంద్ర పద్మనాభరెడ్డి సహా ఇంకా గుర్తించని పలువురు ఇతర నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement