Saturday, May 4, 2024

Cash Seized – బ్ర‌హ్మ‌ణ‌కొట్లూరు చెక్ పోస్ట్ వ‌ద్ద 13 లక్షల నగదు పట్టివేత…

నంద్యాల – బ్రాహ్మణకొట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతర్ జిల్లా చెక్పోస్ట్ వద్ద ఎస్సై నాగార్జున, సిబ్బంది తనిఖీ చేస్తున్న సంద‌ర్భంగా 13 ల‌క్ష‌ల న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు.. కారులో శ్రీనివాస్ గౌడ్ నగదుకు త‌ర‌లిస్తుండ‌గా ప‌ట్టుకున్నారు. డబ్బులు గురించి వివరాలు అడగగా శ్రీనివాస్ గౌడ్ నందికొట్కూరు లోని అప్కమింగ్ సినిమాలకు అడ్వాన్స్ ఇవ్వడానికి బళ్లారికి చెందిన శేఖర్ రెడ్డికి ఇవ్వడానికి వెళుతున్న‌ట్టు చెప్పాడు..దీనికి సంబంధించి ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు చూప‌లేక‌పోయాడు ..నందికొట్కూరు డిప్యూటీ తాసిల్దార్ సోమేశ్వర్ దేవి సమక్షంలో పంచనామా నిర్వ‌హించి న‌గ‌దును సీజ్ చేశారు. డబ్బులను ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ స్వాధీనం చేశారు..

.

Advertisement

తాజా వార్తలు

Advertisement