Friday, November 8, 2024

Tirumala: శ్రీవారికి కాసుల పంట … నాలుగు రోజుల‌లో రూ.26 కోట్ల హుండీ ఆదాయం…

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. నేడు భ‌క్తుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గింది.. స్వామివారి ద‌ర్శ‌నానికి 10 గంట‌ల స‌మ‌యం ప‌డుతున్న‌ది.. స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకేన్లు తీసుకున్న వారికి కేవ‌లం నాలుగు గంట‌ల‌లోనే ద‌ర్శ‌నం క‌లుగుతున్న‌ది.

వైకుంఠ ద్వార దర్శనాలు నిన్న వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులు 71,488 దర్శించుకున్నారు. 19,137 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.4.17 కోట్లు ఆదాయం వచ్చింది. శ్రీవారి నాలుగు రోజుల్లో 2,72,207 మందికి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. నాలుగు రోజుల్లో శ్రీవారి హుండీ ఆదాయం 25.82 కోట్లు. జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కొన‌సాగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement