Monday, April 15, 2024

ఏపీలో ఉప ఎన్నిక‌.. ఆత్మ‌కూరు అసెంబ్లీ బైపోల్‌కు షెడ్యూల్ రిలీజ్‌

ఏపీలో ప్రస్తుతం రాజ్య‌స‌భ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ ఎన్నిక‌లు ముగియగానే మ‌రో ఉప ఎన్నిక‌కు న‌గారా మోగ‌నుంది. ఈ మేరకు బుధ‌వారం కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఈసీ షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. ఆత్మ‌కూరుతో పాటు దేశంలోని 10 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ఈసీ రెడీ అయ్యింది. ఈ షెడ్యూల్ ప్ర‌కారం ఆత్మ‌కూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక‌కు ఈ నెల 30న నోటిఫికేష‌న్ జారీ కానుంది. నోటిఫికేష‌న్ విడుద‌లైన రోజు నుంచి జూన్‌ నెల 6 వ‌ర‌కు నామినేష‌న్ల దాఖ‌లుకు అవ‌కాశం ఉంటుంది. జూన్‌ 9 వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ఉంటుంది. ఆ త‌ర్వాత జూన్ 23న పోలింగ్ నిర్వ‌హించ‌నుండ‌గా… జూన్ 26న ఓట్ల లెక్కింపు నిర్వ‌హించి అదే రోజు ఫ‌లితాన్ని వెల్ల‌డించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement