Wednesday, May 1, 2024

Bumper Offer – దిశా యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే….

అమలాపురంలోని ప్రముఖ షాపింగ్ మాల్ వద్ద మహిళ పోలీసులతో దిశ యాప్ రిజిస్ట్రేషన్ కౌంటర్ ఏర్పాటు చేశారు .దిశా యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే బట్టల షాప్‌లో కొనుగోళ్లపై 15 శాతం డిస్కౌండ్ ఇచ్చేలా వినూత్న ఆఫర్ ప్రకటించారు దీంతో స్థానిక మహిళలు షాపింగ్ మాల్‌కు పోటెత్తారు.

దిశా యాప్‌ను డౌన్‌లోడ్చేసుకోని ఆ షాపింగ్ మాల్‌లో 15 శాతం రాయితీ పొందుతున్నారు. ప్రతిఒక్క మహిళ దగ్గర రక్షణ కోసం ఈ యాప్ ఉండాలనే ఆలోచనతోనే ఈ ఆఫర్ పెట్టామని డీఎస్పీ అంబికా ప్రసాద్ తెలిపారు. దీనికి తోడు ఈ రోజు ఆదివారం కావడంతో చాలామంది మహిళలు ఆ షాపింగ్ మాల్‌కు తరలివచ్చారు. తమ తమ సెల్ ఫోన్ లలో దిశా యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement